షాకింగ్.. 12 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించిన బాలుడు..!

-

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలంటే.. ఎన్నో సాఫ్ట్‌వేర్ డిగ్రీలు, కోర్సుల సర్టిఫికెట్లు, ఎక్స్‌పీరియెన్స్.. ఇలా ఏవీ ఉండాల్సిన పనిలేదు. నేర్చుకున్న అంశాలపై పట్టు ఉంటే చాలు. దాంతో ఏ కంపెనీలో అయినా సులభంగా ఉద్యోగం సాధించవచ్చు. అందుకు డిగ్రీ, వయస్సుతో కూడా పనిలేదు. అవును, సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మాడు కాబట్టే ఆ బాలుడు 12 ఏళ్ల వయస్సులోనే ఏకంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో అతనికున్న ప్రతిభా పాటవాలను గమనించి ఓ కంపెనీ ఆ బాలుడికి తమ కంపెనీలో డేటా సైంటిస్ట్ జాబ్ ఇచ్చింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే…

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ శ్రీవాత్సవ్ అనే 12 ఏళ్ల బాలుడికి స్థానికంగా ఉన్న మాంటెయిన్ స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీ డేటా సైంటిస్ట్‌గా జాబ్ ఇచ్చింది. అంత తక్కువ వయస్సులోనే, ఎలాంటి డిగ్రీ లేకుండా ఆ బాలుడికి అంత పెద్ద జాబ్ లభించిందంటే.. అందుకు అతనికి ఉన్న సాఫ్ట్‌వేర్ కోడింగ్ పరిజ్ఞానమే కార‌ణ‌మ‌ని చెప్పవచ్చు.

అయితే ఈ విషయంపై ఆ బాలున్ని మీడియా ప్రశ్నించగా.. అందుకు అతను బదులిస్తూ.. తనకు చిన్నప్పటి నుంచే సాఫ్ట్‌వేర్ కోడింగ్ అంటే ఇష్టమని, తన తల్లిదండ్రులు తనకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్చించారని, అందుకనే ఈ ఏజ్‌కు వచ్చేసరికి వాటిలో ప్రావీణ్యత సంపాదించి, చివరకు జాబ్ కూడా పొందానని అతను చెప్పాడు. ఇక తన కెరీర్‌లో మరింత ముందుకు సాగుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో అద్భుతాలు చేయాలనుందని అతను తెలిపాడు. అవును మరి.. అంత చిన్న ఏజ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయ్యాడంటే.. ఇక ఆ బాలుడు తాను అనుకున్నధి సాధిస్తాడనే నమ్మకం కలుగుతుంది కదా.. ఏది ఏమైనా.. ఆ బాలుడి ప్రతిభా పాటవాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version