వజ్రం కంటే అత్యంత దృఢపదార్థం ఇదే..!

-

ఇప్పటి వరకూ వజ్రానికి మించిన దృడపదార్థం లేదనుకున్నాం.. కానీ జగతిలో మనిషి తలచుకుంటే ఎదైనా మారుస్తాడని మరోసారి ఫూవ్ చేశాడు. వజ్రం కంటే దృడ పదార్థాన్ని కనుగొన్నాడు. వివరాళ్లోకి వెళితే.. బ్రిటీష్ శాస్త్రవేత్తలు సరికొత్తగా సృష్టించిన ఓ పదార్థాన్ని ఏ యంత్రం విభజించలేదని ప్రకటించారు. అందుకే ఈ పదార్థానికి ‘ప్రొటియస్’గా నామకరణం చేశామన్నారు. ఈ పదార్థానికి పేరు ఎలా వచ్చిందంటే గ్రీకుల పూజించే సముద్ర దేవత పేరు ప్రొటియస్. ఈ దేవత తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఈ పదార్థానికి కూడా లక్షణాలు అలానే ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

solid material

బ్రిటన్ లోని డుర్హామ్ యూనివర్శిటీ, ఫ్రాన్ హోపర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రొటియస్ ను రూపొందించారు. సిరామిక్ గోళాల నుంచి తయారు చేశారు. ద్రాక్ష పండ్ల ఉపరితంపై ఉండే దృడమైన పొర, సముద్ర నత్తల పైభాగంలో ఉండే గట్టి పెంకు ఆధారంగా ప్రొటియస్ పదార్థాన్ని రూపొందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏ యంత్రం ఈ పదార్థం ముందు నిలవదని, లోహాలు కత్తిరించే యంత్రాలైనా, డ్రిల్లింగ్ మిషిన్లు అయినా దీని ముందు విగిరిపోవాల్సిందేనని బల్లకొట్టి చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version