ఇది కదా ట్వీట్ అంటే, అమ్మాయి నెంబర్ అడిగిన అబ్బాయికి షాక్ ఇచ్చిన పోలీసులు…!

-

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, పోలీసులు ప్రజలకు దగ్గర కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సరదా సరదాగా స్పందిస్తూ వాళ్ళు ప్రజలతో స్నేహం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియాలో తమ పోస్ట్ లు కామెంట్ల ద్వారా హాస్యాన్ని పంచుతున్నారు.

ఆదివారం, ఒక మహిళ తన ట్వీట్‌లో పూణే పోలీసులను ట్యాగ్ చేసి, ధనోరి పోలీస్ స్టేషన్ నెంబర్ అడిగారు. పూణే పోలీసులు నంబర్‌ ఇచ్చి స్పందించిన తరువాత, బయటి వ్యక్తి ఆమె నెంబర్ కావాలని పూణే పోలీసులను కోరాడు. “నేను దయచేసి ఆమె నంబర్ తీసుకోవచ్చా?” అని పోలీసులను కోరాడు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలా ఏ విధంగా అడుగుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పూణే పోలీసులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా తమదైన శైలిలో స్పందించారు. “సర్, లేడీ నంబర్‌పై మీ ఆసక్తిని అర్థం చేసుకోవడానికి మేము ప్రస్తుతం మీ నంబర్‌పై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాము” అని రిప్లయ్ ఇస్తూ వారి గౌరవిస్తున్నందున నేరుగా వారికి మెసేజ్ చేయమని సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల రిప్లయ్ ని పలువురు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version