ఇదేందయ్యా ఇది.. కోడి పుంజు గుడ్డు పెడుతుంది ఏంటి!

-

ప్రపంచంలో చాలా వింతలు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని వింతలు చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి వాటి గురించి ఆలోచించేలా చేస్తాయి . అలాంటి వింతే ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. అక్కడ కోడి పుంజు కూడా గుడ్లు పెడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుందట. ఇంతకీ విషయమేంటంటే…

తూర్పుగోదావరి జిల్లాలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి ఎస్టీ కాలనీ కి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కోడి పుంజు ఏకంగా ఈ మధ్య గుడ్డు పెట్టింది. కోడి పుంజు గుడ్డు పెట్టడమేంటని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. అయినా కానీ ఇది నిజం. ఈ విషయం విన్న కోడి పుంజు యజమాని సుబ్రహ్మణ్యం రెడ్డితో పాటు చుట్టు పక్కల వాళ్లు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. మొదట కోడి పుంజు గుడ్డు పెట్టి ఉండడాన్ని చూసిన యజమాని సుబ్రహ్మణ్యం రెడ్డి నమ్మలేదు. ఏదో వేరే కోడి పెట్టి ఉంటుందని అనుకున్నాడు. కానీ తర్వాత రోజు కూడా పుంజు గుడ్డు పెట్టడం కళ్లారా చూసిన ఆయన షాకింగ్ గా ఉన్నా నమ్మక తప్పలేదు.

ఇలా కోడి పుంజు ఏకంగా ఐదు రోజుల పాటు గుడ్డు పెట్టింది. ఆ గుడ్లు జాగ్రత్తగా దాచిన సుబ్రహ్మణ్యం రెడ్డి కోడి పుంజును పొదిగేశాడు. అలా పుంజును పొదిగేసిన కొద్ది రోజుల తర్వాత చూడగా ఆయనే ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ పుంజు ఆ ఐదు గుడ్లతో ఏకంగా పిల్లలను కనింది. ఈ విషయం చూసి షాక్ కు గురైన సుబ్రహ్మణ్యం రెడ్డి స్థానిక వెటర్నరీ డాక్టర్లకు విషయం చెప్పగా… వారు జన్యు పరమైన సమస్యలతో ఇలా కావచ్చని చెబుతున్నారు. ఇది విన్న వెటర్నరీ అధికారులు ఇది కామన్ అనే చెప్పారు. కన్న పిల్లలను ఆ కోడి పుంజు కంటికి రెప్పలా కాపాడుకుంటుండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version