తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 9న జిఆర్ఎంబి, కేఆర్ఎంబి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఈ సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ర్టాల ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా లేఖ రాశారు. తొమ్మిదో తేదీన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరుగనుంది.
ఇక ఈ రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరుగనుంది. అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రెండు బోర్డులు…అసలు ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తాయోనని ఇరు రాష్ట్రాల నేతలు మరియు అధికారుల్లో ప్రశ్న నెలకొంది. అయితే.. కేంద్రం ఇటీవలే విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాల అమలు, కార్యాచరణ పై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సమాచారం కేఆర్ఎంబీ ఇచ్చినట్లు తెలుస్తోంది.