నా లైఫ్ లో జరిగిన చేదు ఘటన ఇదే.. ఎమోషనల్ అయిన రష్మిక మందన్న ..!

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్ భారత దేశ సినీ పరిశ్రమకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు , తమిళ్ , కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలలో నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆరేళ్ల సినీ కెరియర్లో ఇప్పటివరకు 17 కు పైగానే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో రష్మికపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఆమెపై ట్రోల్ చేస్తున్నది ఎవరో కాదు కన్నడ నేటిజన్స్.. ఇలాంటి సమయంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ పాల్గొన్న రష్మిక తన గురించి ఎన్నో విషయాలను బయట పెట్టడమే కాకుండా తనకు జరిగిన చేదు ఘటనల గురించి చెబుతూ.. ఆ సమయంలో వెక్కి వెక్కి ఏడ్చానని కూడా చెబుతోంది. అసలు విషయంలోకెళితే కన్నడలో కిరికి పార్టీ ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈమె.. దేశం మెచ్చిన కాంతారా సినిమాను ఇంకా చూడలేదని చెప్పి కన్నడ నేటిజన్స్ ఆగ్రహానికి గురైంది. అప్పటినుంచి ఈమెను రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు.

ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ .. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నవ్వుతూ ఉంటావు? ఎలా సాధ్యమని చాలా మంది అడుగుతున్నారు.. నేను చిన్నప్పుడు ఇలా బ్రతకడం నేర్చుకున్నాను .. స్కూల్లో చదువుకునేటప్పుడు కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉండేదాన్ని.. దాదాపు 800 మంది స్టూడెంట్స్ అక్కడే ఉండే వాళ్ళు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ తక్కువగా ఉండటం వల్ల చాలా అపార్థం చేసుకునేవారు. చేయని తప్పులకు కూడా మాట పడేదాన్ని. ఆ టైంలో ప్రతిరోజు రాత్రి గదిలో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. ప్రతి విషయాన్ని నేను మా అమ్మతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు. ఆమె నన్ను ఇంత స్ట్రాంగ్ గా మార్చింది. ప్రపంచంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయి..కాబట్టి దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version