మన జీవితంలో మిగిలిపోయే క్యారెక్టర్ ఇది: యంగ్ టైగర్ ఎన్టీఆర్

-

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌.అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది . ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇక ఈ సక్సెస్ మీట్ కి హాజరైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ…’డీజే టిల్లు’ సినిమాలో ఉన్నట్లుగా సిద్ధూ బయట ఉండరని అన్నారు. సిద్ధూకు ఎంత సేపూ సినిమా, క్యారెక్టర్కు న్యాయం చేయాలనే తపన ఉందని అన్నారు. ‘డీజే టిల్లు’ మూవీతో మన జీవితంలో మిగిలిపోయే క్యారెక్టర్ ఇచ్చారని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. టిల్లు మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయ్యాడని అన్నారు. నవ్వలేను బాబోయ్ అనేంతగా టిల్లు పాత్రలో సిద్ధూ నవ్వించాడన్నారు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news