ఉత్తర కొరియా పర్యటనకు రష్యా అధ్యక్షుడు … 24 ఏళ్లలో ఇదే తొలిసారి

-

ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 18- 19వ తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్లు వెల్లడించింది.

ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరోవైపు.. ప్యాంగ్‌యాంగ్‌ ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉండడంతో అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఉత్తర కొరియాలో పుతిన్‌ పర్యటించడం 24 సంవత్సరాలలో ఇది మొదటిసారి.

గత ఏడాది సెప్టెంబరులో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యాలో పర్యటించారు.మాస్కోలో పుతిన్‌, కిమ్‌లు సమావేశమై.. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని కీలక నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలోనే కిమ్‌ పర్యటనకు రావడంతో అమెరికా సహా దాని మిత్రదేశాలు ఆందోళనకు గురి అయ్యారు. యుద్ధం విషయంలో మాస్కోకు రాకెట్లు, క్షిపణులు ఇతర ఆయుధాలను సరఫరా చేసి.. బదులుగా అణ్వాయుధ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతికతను ప్యాంగ్‌యాంగ్‌ పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news