బాబు గారికి ఇది చివరి ఎన్నికే – మంత్రి అంబటి

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే, లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో తనని అవమానించారని.. తన భార్యని కూడా అవమానించారని, ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మండిపడ్డారు. ఈ కౌరవ సభను గౌరవ సభ చేస్తానని పేర్కొన్నారు. అయితే తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. “వరుస ఓటములతో బాదుడే బాదుడు చవి చూసిన బాబు గారికి ఇది చివరి ఎన్నికే! తప్పదు ఓటమి కుప్పంలో సైతం! అని ట్వీట్ చేశారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version