ఏపీ వార్షిక బడ్జెట్ స్వరూపం ఇదే.. ఆర్థిక మంత్రి కీలకవ్యాఖ్యలు

-

ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ 2024-25ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ కాపీస్‌లోని పద్దులను చదివి వినిపిస్తున్నారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వ తప్పిదాలపై విమర్శలు చేశారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది. గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు. 93శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ఏపీ వార్షిక బడ్జెట్ స్వరూపం..

ఏపీ బడ్జెట్ మొత్తం విలువ రూ.2.94 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743, ద్రవ్య లోటు రూ.68,743, జీఎస్‌డీపీలో రెవెన్యూలోటు అంచనా రూ.4.19 శాతం, జీఎస్‌డీపీ ద్రవ్యలోటు అంచనా రూ.2.12 శాతంగా ఉందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version