చంద్రునిపై కూలిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది ఇతనే తెలుసా..?

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2కు చెందిన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను నాసా గుర్తించిన సంగతి తెలిసిందే. చంద్రునిపై కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను నాసా తన లూనార్ రీకనెయిస్సెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో) ద్వారా గుర్తించింది. ఈ క్రమంలోనే సదరు ఆర్బిటర్ తీసిన ఫొటోలను నాసా విడుదల చేసింది. అయితే నిజానికి చంద్రునిపై కూలిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది నాసా కాదు.. ఆ పని చేసింది.. చెన్నైకి చెందిన ఓ యువ మెకానికల్ ఇంజినీర్. అతని పేరు షణ్ముగ సుబ్రమణియన్. ఇంతకీ అతనేం చేశాడంటే..?

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవం మీద దిగాల్సి ఉండగా, చంద్రుని నుంచి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌కు, ఇస్రోకు సంకేతాలు తెగిపోయాయి. కమ్యూనికేషన్ ఆగిపోవడంతో ఇస్రో సైంటిస్టులు ఇక చంద్రయాన్ 2 ఫెయిలైందని ప్రకటించారు. అప్పుడు ల్యాండర్‌ను గుర్తించినా దాంతో కమ్యూనికేషన్ లేని కారణంగా ఇస్రో సైంటిస్టులు ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలో ల్యాండర్ చంద్రునిపై కూలింది.

అయితే ల్యాండర్ చంద్రునిపై కూలిపోకముందు, కూలిన తరువాత చంద్రునిపై ఉన్న ఆ ప్రాంతాన్ని నాసా ఫొటోలు తీయగా, వాటిని పరిశీలించి ల్యాండర్ ఎక్కడ ఉందో చెప్పాలని నాసా పలువురు ఔత్సాహికులకు సూచించింది. దీంతో షణ్ముగ సుబ్రమణియన్ ఆ ఫొటోలను పరిశీలించి విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించి నాసాకు ఆ ఫొటోలను వివరాలతో సహా ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 3వ తేదీన అతను ఆ ఫొటోలను ట్వీట్ చేయగా, సుమారుగా 2 నెలల పాటు నాసా చంద్రునిపై ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని స్కాన్ చేసింది. ఆ తరువాత అక్కడే విక్రమ్ ల్యాండర్ కూలిందని నిర్దారించుకుని ఆ ప్రదేశాన్ని మళ్లీ క్షుణ్ణంగా స్కాన్ చేయగా, అక్కడే ల్యాండర్ శిథిలాలు కనిపించాయి. దీంతో ఆ శిథిలాలను నాసా ఫొటో తీసి వాటిని షేర్ చేసింది. ఈ క్రమంలో నాసా ఈ విజయానికి క్రెడిట్‌ను షణ్ముగ సుబ్రమణియన్‌కే ఇచ్చింది. ఈ మేరకు నాసా అతనికి ఓ మెయిల్ కూడా పంపింది. దీంతో షణ్ముగ సుబ్రమణియన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version