గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ గడువు పెంపు..!

-

కరోనా మహమ్మారి వలన మనం ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్నాం. ఆ సమయం లో హెల్త్ వర్కర్స్ పోరాడారు. వాళ్ళ కోసం కేంద్రం ఇన్సూరెన్స్ స్కీమ్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ గడువును కేంద్రం పొడిగించింది. నేటి నుంచి మరో 180 రోజుల పాటు వైద్యారోగ్య సిబ్సందికి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

money

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకు రావడం జరిగింది. హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని మరికొంత కాలం పాటు అందించాలని కేంద్రం అనుకుంటోంది. ఈ స్కీమ్ గడువును ఆరు నెలల పాటు పొడిగించినట్టు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది.

భారత్‌లోని 22.12 లక్షల మంది వైద్యారోగ్య కార్మికులకు, ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను తీసుకొచ్చింది ప్రబుత్వం. నేరుగా కాంటాక్ట్ అయ్యే ప్రైవేట్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కరోనా పేషెంట్ల చూసుకునే ఈ వైద్యారోగ్య సిబ్బందికి కూడా వైరస్ సోకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున వారి కుటుంబాలు ఆర్థిక నష్టంలో పడకూడదని ఈ నిర్ణయాన్ని తీసుకుంది ప్రబుత్వం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version