మా నాన్న సూపర్ స్టార్..అందరి ధైర్యం – నారా లోకేష్ ట్వీట్

-

ఇవాళ తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతి పక్ష నాయకులు, మాజీ సీఎం నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలోనే.. తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు నారా లోకేష్‌. మా నాన్న సూపర్ స్టార్..అందరి ధైర్యంఅని ట్వీట్‌ చేశారు. జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడన్నారు.

ఆ ప్రకారంగా చూస్తే ఆయన దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారని.. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారని స్పష్టం చేశారు.

ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా అని…లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం అని కొనియాడారు. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన… సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్… ఆయనే మా నాన్న చంద్రబాబు గారు అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version