ఇలా చేస్తే కరోనా బారిన పడకుండా ఉండచ్చు..!

-

కరోనా వైరస్ వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలు కి వెళ్ళకుండా వీలైనం తవరకు ఇంటిపట్టునే ఉండాలి.

ఒక వ్యక్తి నుంచి కనీసం ఒక మీటర్ డిస్టెన్స్ అయినా తీసుకోవాలి. మంచి వెంటిలేషన్ ఇంటిలోకి వచ్చేటట్టు చూసుకోండి. మీ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించండి. వీటన్నిటినీ పాటిస్తూ ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

షాపింగ్ కి వెళ్ళద్దు:

షాపింగ్ కి వెళ్లడం వల్ల ఎక్కువమంది ఉంటారు కాబట్టి కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా షాపింగ్ కి వెళ్లడం వల్ల కరోనా బారిన పడొచ్చు. అసలే పండగ సీజన్ కాబట్టి ఎక్కువ మంది షాపింగ్ కి వస్తూ ఉంటారు. కనుక వీలైతే షాపింగ్ కి వెళ్ళకుండా చూసుకోండి.

పార్టీలకు వెళ్ళద్దు:

పెళ్లిళ్లు, పార్టీలకు వెళ్లడం వల్ల కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సినిమా ధియేటర్ కి వెళ్లొద్దు:

సినిమా థియేటర్ కి వెళ్లడం వల్ల కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సినిమాలకి వెళ్లకుండా చూసుకోండి. ఇలా ఈ ప్రదేశాలను అవాయిడ్ చేయడం వల్ల కరోనా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version