ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా చంద్రాబునాయుడుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రులుగా కొందరు సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో సీనియర్లలో అయ్యన్న పాత్రుడు, కాలువ శ్రీనివాసులు, కొణతాల రామకృష్ణ, పితాని సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి స్పీకర్ పదవికి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
అటు మంత్రి పదవులు ఇవ్వకుండా వారికి చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. ఏపీలో ఈసారి సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు పదవులు దక్కలేదు. వారిలో ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. అయితే ఈసారి టీడీపీ మంత్రి పదవులను చాలా వరకు కొత్తవారికి కేటాయించడం విశేషం.