సోషల్ మీడియా ప్రచారం: బిగ్ బాస్ 5లోకి ఆ నలుగురు..?

-

పోయిన సంవత్సరం కరోనా కారణంగా బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఆలస్యంగా మొదలైంది. అయినా ప్రేక్షకుల మన్ననలు పొందడంలో విఫలం కాలేదు. ఇంట్లోనే కూర్చుని ఉండడం వల్ల బిగ్ బాస్ నాలుగవ సీజన్ మంచి వినోదాన్నే అందించింది. ఐతే తాజాగా బిగ్ బాస్ ఐదవ సీజన్ గురించి వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ మొదలవడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నా కూడా అప్పుడే అనేక ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. బిగ్ బాస్ ఐదవ సీజన్లోకి కంటెస్టెంట్లుగా ఎవరు వెళ్తున్నారనే విషయమై తాజాగా ఒక వార్త బయటకి వచ్చింది.

అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీల్లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ ఐదవ సీజన్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న హైపర్ ఆది, టిక్ టాక్ ఇప్పుడు లేకపోయినప్పటికీ దాని వల్ల ఫేమస్ అయిన దుర్గారావు, మేల్ యాంకరింగ్ లో మంచి స్థానంలో ఉన్న రవి, యూట్యూబ్ సిరీస్ ల ద్వారా యువతకి బాగా దగ్గరైన షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నట్లు అంటున్నారు. బిగ్ బాస్ మొదలవడానికి ఇంకా చాలా సమయమున్నా ఇప్పుడే వార్తలు రావడం కొంత ఆశ్చర్యమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version