భక్తి: శివ పురాణాన్ని అసలు ఎందుకు రచించారంటే..?

-

సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది రోజు అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే సాధారణంగా సోమవారం నాడు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి శివునికి అభిషేకము లేదా అర్చన చేస్తూ ఉంటారు. ఆ తర్వాతనే ఏ పనైనా చేస్తారు. అయితే స్తోత్రాల తో పాటు ఇంకేమి పఠించాలి అని అనుకుంటే దీనిని తప్పకుండా చదవండి.

 

సహజంగా శైవులు, వైష్ణవులు శివుడు ని ఆరాధించడమే కాకుండా శివ పురాణం కూడా చదువుతూ ఉంటారు. ఎందుకంటే శివ కేశవుల లో ఎవరికి పూజ చేసినా రెండో వారిని కూడా పూజ చేసినట్టే. ఈ విషయాన్నీ గుర్తుంచుకోండి.

శివునికి విష్ణు మూర్తి కి ఎటువంటి భేదము లేదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శివ కేశవులకు బేధం లేదన్న వారు దాన్ని గ్రహించే వరకు తప్పకుండా మళ్లీ మళ్లీ పుడుతూ చస్తూ ఉండాల్సిందే అని పురాణాలు చెబుతున్నాయి.

అందరికీ వచ్చే సందేశం ఏమిటంటే ఎన్నో వేదాలు ఈ భూమి పై ఉండగా మళ్లీ పురాణాలు ఎందుకు రచించారని అనుకుంటారు. నిజానికి వేదాలను అర్థం చేసుకోలేని వాళ్లు చాలా సులభంగా ఈ పురాణాలను అర్థం చేసుకుంటారని ఋషులు వీటిని రచించారు. ఈ విధం గానే శివ పురాణం కూడా రచించబడినది. ముఖ్యంగా శివ పురాణం లో శివుని యొక్క శక్తిని గురించి వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version