సింహాచలం గోడ దుర్ఘటనలో బాధ్యులు సస్పెండ్ అయ్యారు. ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆలయ ఈవో కె.సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ సహా పలువురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. గోడ నిర్మించిన కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్దారించింది కమిటీ. భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్, అధికారులు కారణమయ్యారని నివేదిక తేల్చింది కమిటీ. కమిటీ సిఫారసు ఆధారంగా చర్యలకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురు అధికారుల సస్పెన్షన్‌కు ఆదేహాలు జారీ అయ్యాయి.