ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు తాజాగా మరణించారు. అంటే బేని మీ సంవత్సరాలు ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు… తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

1978 సంవత్సరంలో అన్నమయ్య రాయచోటి నుంచి… జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పాలకొండ్రాయుడు. 1983 సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు. ఇక 1984 సంవత్సరం ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థిగా గ్రాండ్ విక్టరీ కొట్టారు సుగవాసి పాలకొండ రాయుడు. అలాగే 1999, 2004 సంవత్సరంలో రాయచోటి నుంచి టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇక మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు మరణించిన నేపథ్యంలో టిడిపి పార్టీలో విషాదం నెలకొంది.