తెలుగు సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దీక్ష దేవాలయ రక్ష పేరుతో విజయవాడలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాలు హైందవ
శంఖారావం బహిరంగ సభ ను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో హైందవ ధర్మం పై దాడి జరుగుతుందని, ముఖ్యంగా సినిమాల్లో హైందవ పురాణాలను వక్రీకరిస్తున్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని, కొందరు అన్యమతస్తుల ప్రవర్తన ఇబ్బమంది పెడుతోందని గుర్తు చేశారు.
కల్కీ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని, ఆయన్ను సురుడు అంటే ఎవరు ఒప్పుకోరని..
సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చారు. అలాగే
ఎవరు చేసిన తప్పును తప్పు అని చేప్పాలస్సిందేనని సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్
చెప్పుకొచ్చారు.