తాలిబన్ల అరాచకాలు : లైవ్​లో యాంకర్‌పై బెదిరింపులు

-

ఆఫ్ఘనిస్తాన్‌ దేశం లో రోజు రోజుకు దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇప్పటికే టీవీ మరియు రేడియో లలో మహిళలను పని చేయకూడదని ఆదేశాలు జారీ చేయగా… తాజాగా మరో దారుణానికి ఒడి గట్టారు. ఒక టీవీ యాంకర్‌ ను తాలిబన్లు లైవ్‌ లో బెదిరించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

టీవీ లైవ్‌ జరుగుతుండగానే యాంకర్‌ వెను తుపాకులు ఎక్కుపెట్టి.. తమను ప్రశంసించాలని సాయుదులుగా ఉన్న తాలిబన్లు బలవంతపెట్టడంతో వారిని పొగడడం తప్ప మరొక దారి లేకుండా పోయింది ఆ యాంకర్‌ కు. అయితే.. మీడియా స్వేచ్ఛకు ఏ మాత్రం విఘాతం కలిగించమని చెబుతూ.. తాలిబన్లు గతంలో ఇచ్చిన హామీ ఏమైందని ఇప్పుడు వారిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా… నిన్న కాబూల్‌ ఎయిర్‌ పోర్టు లో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటన లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version