యజమానికి తెలియకుండా 160 కోట్లకు త్రీస్టార్ హోటల్ బేరం పెట్టేసారు…!

-

కొన్ని కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే మాయలు అన్నీ ఇన్ని కావు. కబ్జా చేయడమే కాకుండా మనకు తెలియకుండానే మన ఆస్తులను అమ్మేస్తూ ఉంటారు. దీనితో వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒకరికి తెలియకుండా ఒకరి ఆస్తులను మరొకరికి అమ్మడమే కాకుండా అడ్వాన్సు లు తీసుకుని వేధిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

కబ్జాల్లో కూడా వాళ్ళు ఆరి తెరిపోయి ఉంటారు. వాళ్ళ వ్యాపారం కోసం దేనికి అయినా తెగిస్తారు అనే విమర్శలు కూడా వారిపై ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జరిగింది… ఒక హోటల్ యజమానికి తెలియకుండా చెన్నైలో 3 స్టార్ హోటల్ ని బేరం పెట్టేసారు రియల్టర్లు. హోటల్ లాబీల్లో కూర్చుని బేరం ఆడారు. అప్పులతో హోటల్ అమ్మకానికి సిద్దంగా ఉందని ఒక సంస్థకు లేఖ రాసారు.

యజమానికి తెలియకుండానే అమ్మాలని చూసారు. అప్పులతో అమ్మేస్తున్నారని ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్నామని లేఖ రాసారు. 10 శాతం అడ్వాన్సు తీసుకుంటుండగా హోటల్ యాజమాన్యానికి డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంతకు ఎంతకు బేరం పెట్టారో తెలుసా…? కోటి రెండు కోట్లు కాదు 160 కోట్లకు బేరం పెట్టడంతో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version