చలికాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంపొందించే మూడు ఆహారాలు..

-

చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. జలుబు, ఫ్లూ, దగ్గు వంటివి చాలా సాధారణంగా వచ్చేస్తుంటాయి. అందుకే ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం. ఈ రోజు మనం రోగనిరోధక శక్తిని పెంపొందించే మూడు ఆహారాల గురించి తెలుసుకుందాం.

బాదం

బాదంలో అనేక పోషకాలు ఉన్నాయి. మెగ్నీషియం, రైబోఫ్లీవిన్, జింక్ తో పాటు విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్ గా పన్నిచేసి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాదు అనేక వైరస్ లని ఎదుర్కోవడంలో విటమిన్ పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకే బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఐతే దీన్ని తినడం కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎక్కడైనా తినడానికి వీలుగా ఉంటుంది. ఇంకా, మీకు ఇష్టమైన ఆహారానికి జోడించి కూడా తినవచ్చు.

అల్లం

అల్లం అనేక పోషకాలు వైరస్, బాక్టీరియాలని ఎదుర్కోవడంలో బాగా ఉపయోగపడతాయి. పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో అల్లం టీ తాగితే రోగనిరోధక శక్తి పెరిగి అనేక ఇబ్బందులు దూరమవుతాయి.

సిట్రస్ ఫలాలు..

రోగ నిరోధకశక్తిని పెంచడంలో సిట్రస్ ఫలాలు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఫలాలని సిట్రస్ ఫలాలు అంటారు. సాధారణ జలుబు తగ్గడానికి సిట్రస్ ఫలాలు బాగా పనిచేస్తాయి. ఇంతకీ సిట్రస్ ఫలాలు ఏంటంటే,

నారింజ, బత్తాయి, నిమ్మ, కివీ, జామ మొదలగునవన్నీ సిట్రస్ ఫలాలే.

అసలే కరోనా, వ్యాక్సిన్ ఇంకా రాలేదు. బయట కూడా అన్నీ పనులు పునఃప్రారంభం అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే సరైన మార్గం.

Read more RELATED
Recommended to you

Exit mobile version