టాలీవుడ్ లో ముగ్గురు కుర్ర హీరోయిన్ల హవా..!

-

ఏ సినిమా ఇండస్ట్రీలోనైన కొత్త హీరోయిన్ లు ఎంట్రీ ఇచ్చారు అంటే పాత హీరోయిన్ ల జోరు కాస్త తగ్గుతూ ఉంటుంది. కానీ కొంతమంది హీరోయిన్ లు మాత్రం ఆ కొత్త హీరోయిన్ ల జోరును కూడా తట్టుకొని ఇండస్ట్రీలో క్రేజీ సినిమాలతో కొనసాగుతూ ఉంటారు. అయితే ఇలా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా పోయిన సంవత్సరం విడుదలైన కొన్ని సినిమాలతో కొత్త హీరోయిన్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా వారు నటించిన సినిమాలు విజయవంతం కావడం, వారి నటనకు, అందచందాలకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఆ ముద్దుగుమ్మలను టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కించుకున్న ముగ్గురు హీరోయిన్ ల గురించి తెలుసుకుందాం.

కృతి శెట్టి ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు కృతి శెట్టి అందచందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు థియేటర్ లలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అలాగే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు సరసన ఒక సినిమాలో, రామ్ పోతినేని సరసన ఒక సినిమాలో, నితిన్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

కేతిక శర్మ ఈ హాట్ బ్యూటీ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఈ హాట్ బ్యూటీ నటనకు, అంతకుమించిన హాట్ హాట్ అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమాలో కూడా నటించింది. అలాగే తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రంగరంగ వైభవంగా సినిమాలో హీరోయిన్‌ గా కన్ఫర్మ్ అయింది.

శ్రీ లీల ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version