రోడ్డు ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవ దహనం..!!

-

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పంక్చర్ అవ్వడంతో.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మార్కాపురం మండలం తిప్పాయపాలెం దగ్గర్లోని జాతీయ రహదారిపై సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు.. తిప్పాయపాలెం వద్ద టైరు పంక్చర్ అయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. దీంతో మంటలు భారీగా చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

prakasham road accident

కారు నెంబర్ ఆధారంగా.. ఆ కారు చిత్తూరు జిల్లా బాక్రాపేటకు చెందిన నరేంద్రగా గుర్తించారు. కారు మార్కాపురం హైవే నుంచి కంభం వైపుగా వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే కర్ణాటకకు చెందిన లారీ విజయవాడ వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం సంభవించిందన్నారు. కారు యజమాని ఈతిమర్పు నరేంద్ర తన స్నేహితుడు రావూరి తేజకు కారు ఇచ్చాడని, రావూరి తేజ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రకాశం జిల్లా కంభం నుంచి మార్కాపురం వస్తుండగా.. టైరు పగిలి లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయన్నాను. అందుకే ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version