మస్కిటో కాయిల్స్‌తో ఈ రోగాలు తప్పవు.. మీరు వాడుతున్నారా?

-

ఈ సీజన్‌లో దోమలు బాగా ఉంటాయి. అవి కుట్టాయంటే..డెంగీ లాంటీ జ్వరాలు వస్తాయి. అదేంటో ఓ పక్క చలివేస్తుంది. ఇంకోపక్క దోమలు..ఫ్యాన్‌ వేసుకోకుంటే..ఇవి తింటాయి..వేసుకుంటే..చలి. ఈ బాధ తట్టుకోలేక అందరూ ఇక మార్కెట్‌లో దొరికే మస్కిటో స్ర్పే, కాయిల్స్‌ తెచ్చుకుంటాం. కాయిల్స్‌ స్మెల్‌కి దోమలు చస్తాయో లేదో కానీ..కొందరికి ఆ వాసనకు ఇట్టే నిద్రవచ్చేస్తుంది. మరికొందరికి వాసన రాగనే..తలనొప్పి వచ్చేస్తుంది. ఇది పక్కన పెడితే..అసలు ఈ మస్కిటో కాయిల్స్‌ మనకు చాలా ప్రమాదకరమట..నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

దోమలను చంపే మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం అన్నది నిజం. కాయిల్స్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుందట. ఇది శరీరానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి మస్కిటో కాయిల్ 75 కంటే ఎక్కువ సిగరెట్లను ఉత్పత్తి చేస్తుంది. అంటే అన్ని సిగిరెట్‌ పొగలను మనం ఓకేసారి పీల్చినట్లేగా..తెలిసి తెలిసి ఎవరూ ఇలా చేయరు..కానీ మనకు తెలియకుండానే ఈ అనర్థం జరుగుతుంది. ఒక నివేదిక ప్రకారం, దోమలను చంపే ఈ కాయిల్ పొగ శ్వాసనాళంలో తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని తేలింది. శ్వాసకోశానికి ఆటంకం కలిగిస్తుంది, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందట..వామ్మో చాలా డెంజర్‌గానే ఉందిగా.

దోమలకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆస్తమా వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం కాయిల్ పొగను ఎంత ఎక్కువగా పీల్చుకుంటే ఆస్తమా వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ పొగ శిశువు శ్వాసపై చెడు ప్రభావం చూపుతుంది. ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న గదిలో అసలే పెట్టకూడదు.

మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ కళ్ళు, చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. కళ్ల మంట పెరగడం వల్ల సమస్యలు వస్తాయి. పొగ ఎంత ఎక్కువగా ఉంటే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

కాయిల్ తయారీలో ఉపయోగించే రసాయనాలను బగ్ స్ప్రేలో కూడా ఉపయోగిస్తారు. అసలు దోమలు ఇంటికి రాకుండా మెష్ డోర్ పెట్టుకోవటం చాలా బెటర్‌. మీలో ఎవరైనా ఈ కాయిల్స్‌ వాడుతుంటే..వెంటనే మానేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version