హైదరాబాద్ మహానగరంలో ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. హయత్ నగర్‌కు చెందిన శ్రీ చరిత్, బంజారా కాలనీకి చెందిన అప్ప చరణ్, శాంతి నగర్‌కి చెందిన కార్తీక్ గురువారం స్కూల్‌కు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాల పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా విద్యార్థుల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఓ సీసీ కెమెరాలో ముగ్గురు విద్యార్థులు కలిసి వెళ్తున్నట్లు దృశ్యాలు రికార్డు అయ్యాయి.దీంతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కనిపించకుండాపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.