జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మరో ఇద్దరి మృతదేహాలను పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గ్రామస్థులు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
మొదట ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
మరోవైపు, అనంత్‌నాగ్ జిల్లాలో ఓ ముష్కరుడు రెచ్చిపోయాడు. బోండియాల్గామ్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులిద్దరినీ బిహార్, నేపాల్‌కు చెందిన వలసకూలీలుగా పోలీసులు గుర్తించారు.