సీఎం కేసీఆర్ తాజాగా కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి కొన్ని విషయాలు మీరు వింటే ఆశ్చర్యపడుతారని, ఎంత భయంకరమైన దగా, కుట్ర. అయితే సఖ్యత లేదంటే ఈడీ అని బెదిరిస్తున్నారన్నారు సీఎం కేసీఆర్. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొన్నది మేమేనని, ఆ తర్వాత లేబర్ వేషాలు వేయించి తీసుకెళ్లామని, ముంబైలో డబ్బులు ఇచ్చామని చెప్పారని, క్లియర్‌గా ఏం జరిగిందో చెప్పారన్నారు సీఎం కేసీఆర్. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లామని చెప్పారని, 20 సార్లు అమిత్ షా పేరు, ఒకట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారని, ఈ వేల కోట్ల ధనం ఎక్కడిదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టారని ఇటీవలే ఓ పత్రిక వాళ్లు రాశారని, ఇవన్నీ బయటకు రావాలన్నారు. ఈ ముఠా నాయకుడు ఎవరో బయటకు రావాలని, ఈ డబ్బులను ఎవరు తీసుకొచ్చారని, ఈ దేశ న్యాయవ్యవస్థకు దండం పెట్టి అడుగుతున్నానన్న సీఎం కేసీఆర్.. ఈ దేశం ఎప్పుడు ప్రమాదంలో పడ్డ ఈ దేశాన్ని కాపాడింది జ్యుడిషీయరినే అన్నారు. తప్పకుండా కాపాడింది. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక మీద తీర్పు ఇచ్చింది. ఇంత స్వైరవిహారం సరికాదు. కర్ణాటక, మహారాష్ట్రలో కూలగొట్టింది మేమే అని నిసిగ్గుగా చెబుతున్నారు. రిసార్టుల్లో ఉండి ప్రభుత్వాలను కూలగొట్టామని చెప్పారు. భారతీయ న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను’ అని కేసీఆర్ పేర్కొన్నారు.