తెలంగాణలో వైద్య సిబ్బందికి శుభవార్త.. రూ.3వేలు ప్రోత్సాహకం

-

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో వైద్య సిబ్బందికి శుభవార్త చెప్పింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్‌ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందించనున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతి సందర్భంలోనూ వివరిస్తూ, అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ నిత్యం పర్యవేక్షిస్తుండటంతో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగాయన్నారు.

దీన్ని మరింత ప్రోత్సహించేలా ‘టీమ్‌ బేస్డ్‌ ఇన్సెంటివ్‌’ పేరుతో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు మంత్ర హరీష్‌ రావు. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో జరిగే ప్రతి సాధారణ ప్రసవానికి రూ.3 వేలు అందిస్తారని తెలిపారు. ఈ నిధులను ప్రతి నెల సూపరింటెండెంట్‌కు విడుదల చేస్తారు. వారు సిబ్బందికి లెక్క ప్రకారం అందించాల్సి ఉంటుందని, ఇందుకు కొన్ని నిబంధనలను విధించింది రాష్ట్ర ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version