ముత్యాల్లాంటి పళ్ళకోసం మూడు చిట్కాలు..!

-

ఎవరైనా ముఖం చూస్తూనే ముందు నవ్వి పలకరిస్తుంటాము. అలా నవ్వడానికి కూడా కొంతమంది మొహమాటపడుతుంటారు. కారణం వాళ్ళు నవ్వినప్పుడు పళ్ళు పచ్చగా గరపాట్టినట్టు ఉండడం వల్ల బాగోదని.పళ్ళు తెల్లగా ఉంటేనే ముఖానికి అందం. పళ్ళఆరోగ్యం అందానికే కాక మన శరీరంలో ఉండే జబ్బులకు కూడా ముడిపడి ఉంటుంది. పళ్ళు పచ్చ గా అవ్వడానికి కారణం పళ్ల పై ఉండే ఏనామిల్ దెబ్బతినడమే.మన ఆహారంలో చక్కెరలను ఎక్కువగా తీసుకోవడం మరియు ప్లోరిన్ ఎక్కువగా వున్న నీటిని త్రాగడం, ఎక్కువ రసాయనాలు కలిగిన టూత్ పేస్టులు వాడడం వల్ల ఇవి పళ్లపై గట్టిగా ఉండే ఏనామిల్ని దెబ్బతీసి పళ్ళను పచ్చగా, గారపట్టినట్టుచేస్తాయి.

ఇలా పళ్ళు గారపట్టినట్టు వున్నవారు వాళ్ళ పళ్ళను అందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టి సరి చేసుకోవాలనుకుంటారు. కానీ అవన్నీ మంచి ఫలితాన్ని ఇవ్వకపోగా దుష్పరిణామల్ని కలగచేస్తుంటాయి. దీని కోసం ఇంటి చిట్కాలను పాటిస్తే ముత్యాల్లాంటి పళ్ళు సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దామా..

తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి.. ఒక స్ఫూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో బెకింగ్ సోడా, రెండు చుక్కల బాదాం నూనె, ఒక స్ఫూన్ ఆరెంజ్ జ్యూస్ వేసి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొద్దున్నే బ్రష్ చేసే సమయంలో టూత్ పేస్ట్ బదులుగా రెండు లేదా మూడు నిముషాలు బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు బ్రష్ చేస్తే ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా తెల్లగా మిల మిల మెరిసిపోవసల్సిందే.

ఆక్టివేటెడ్ చార్కోల్(బొగ్గుపొడి )తో పళ్ళను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ టీ, కాఫి లు త్రాగడం వల్ల కలిగే కావటిస్ నీ, గారను తొందరగా తొలగిస్తుంది.

మనం ఇంట్లో వాడే పాలపొడిని రెండు మూడు రోజులకొకసారి టుత్ పేస్ట్ పై వేసి పళ్ళను బ్రష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే క్యాల్షియం, పాస్పరస్, ప్లోరిన్ వల్ల కలిగే గారను ఈజీగా తొలగించడానికి ఉపయోగపడుతుంది.

పళ్ళను ఆరోగ్యాంగా ఉంచుకోవడానికి ఆహారం తీసుకోగానే నీటిని నోట్లో పోసుకొని తప్పక పుక్కలించాలి. మరియు రోజూ ఉదయం, రాత్రిపూట తప్పక బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే 90 శాతం కావటిస్ రాకుండా మన పళ్ళను కాపాడుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version