పిల్లల హైపర్ యాక్టివిటీ (అది చురుకుదనం) అనేది చాలామంది తల్లిదండ్రులను ఆందోళన గురి చేసే ఒక సాధారణమైన సమస్య. పిల్లలు అదుపు లేకుండా గంతులు వేయడం, ఏకాగ్రత కోల్పోవడం ఒకచోట కూర్చోలేక పోవడం వంటివి హైపర్యాక్టివిటీ లక్షణాలు. చాలా సందర్భాల్లో ఈ ప్రవర్తన గల కారణం వారి ఆహారంలో దాగి ఉంటుంది కొన్ని రకాల ఆహార పదార్థాలు పిల్లల ప్రవర్తన పై ముఖ్యంగా వారి ఏకాగ్రత మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు మీ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తుంటే వారు తిని ఆహారం గురించి ఒకసారి ఆలోచించడం అవసరం హైపర్ యాక్టివిటీ, ఆహారానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరంగా తెలుసుకుందాం..
ప్రాసెస్డ్ ఫుడ్ : చక్కెర కలిపిన పదార్థాలు బిస్కెట్లు, చిప్స్, ప్యాకేజీ జ్యూస్, స్వీట్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ చెక్కర ఎక్కువగా ఉండే ఆహారాలు పిల్లల మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి తరువాత తగ్గిస్తాయి. దీనివల్ల పిల్లలు శక్తిని కోల్పోయి చిరాకుగా, అతి చురుగ్గా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.
కృత్రిమ రంగులు : పిల్లలు తినే ఆహారం లో కొన్ని రకాల రిజర్వేటివ్స్ పిల్లల ప్రవర్తన పై ప్రభావం చూపుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ రసాయనాలు పిల్లల మెదడులోని రసాయన సమతుల్యాన్ని దెబ్బ తీసి హైపర్యాక్టివిటీ దారితీస్తాయి. చాక్లెట్, కూల్ డ్రింగ్స్లలో కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్ లో కెఫెన్ ఉంటుంది. ఇది పిల్లల మెదడును ఉత్తేజపరిచి నిద్రను తగ్గించి అతి చురుగ్గా ఉండేలా చేస్తుంది.
పరిష్కారాలు: పిల్లలకు పండ్లు కూరగాయలు తృణధాన్యాలు, ప్రోటీన్లతో కూడిన సమమైన ఆహారాన్ని అందించాలి. అంతేకాక ప్యాకేజ్ ఫుడ్స్ షుగర్ డ్రింక్స్ కి బదులు తాజా పండ్లు ఇంట్లో తయారు చేసిన ఆహారాలను ఇవ్వండి. ఇక పిల్లలకు తగినంత నీరు తాగించడం కూడా వారి ఆరోగ్యం ప్రవర్తనకు చాల ముఖ్యం.
పిల్లల్లో హైపర్నెస్ అనేది ఓ సమస్య దీనికి ఆహారం ప్రధాన కారణం కావచ్చు చక్కెర కుత్రిమ రంగులు పదార్థాలు పిల్లల ప్రవర్తన పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం సమమైన పోషకాలు అందించడం ద్వారా పిల్లల ప్రవర్తనను మెరుగుపరచవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే మీ పిల్లలు హైపర్ ఆక్టివిటీ తో బాధపడుతుంటే సరైన మార్గదర్శకత్వం కోసం వైద్య నిపుణుడిని సంప్రదించండి.