తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు : తుమ్మల నాగేశ్వర్‌ రావు

-

తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని బాంబు పేల్చారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశానన్న తుమ్మల గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు తుమ్మల నాగేశ్వరరావు. మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం అభివృద్ధికే కేటాయించినట్లు చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రస్తుతం పాలేరులోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని..వారికే పూర్తి సమయం కేటాయిస్తానని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. కాగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల తన నియెజకవర్గానికే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత ఇస్తలేదని.. పార్టీ మారుతారనే ప్రచారం పలుసార్లు వినిపించింది. అయితే ఆయన మాత్రం వాటిపై స్పందించలేదు. ఇటీవలే కేటీఆర్ కూడా ఖమ్మం పర్యటనలో తుమ్మల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్‌ అంగన్‌వాడీలకు అండగా ఉంటున్నారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న వారి దయనీయస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు మంత్రి ఎర్రబెల్లి . ఆగస్టు 01 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే తల్లి పాల వారోత్సవాల సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కొడకండ్ల సెక్టార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి . ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు చీరెలు, ఎదుగుదల లేని పిల్లలకు పౌష్టికాహారం బ్యాగులను పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version