డేంజర్: “థైరాయిడ్” వ్యాధిగ్రస్తులకు బిగ్ అలర్ట్ !

-

మానవునికి సంక్రమించే కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులలో థైరాయిడ్ కూడా ఒకటి. ఒకసారి మనకు సంక్రమిస్తే జీవితాంతం మందులను వాడుతూ ఉండాల్సిందే. కాగా మార్కెట్ లో థైరాయిడ్ కు చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కాగా బేసిక్ గా అందరూ వాడే మందు థైరోనార్మ్. ఒకే మెడిసిన్ ను వందల కంపెనీ లు తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తుంటాయి. ఈ మందును తయారుచేసే అబ్బోట్ అనే కంపెనీ ఒక కీలక ప్రకటన చేసింది. మీరు కొనుగోలు చేసే అబ్బోట్ కంపెనీ థైరోనార్మ్ మెడిసిన్ బ్యాచ్ నెంబర్ AEJ0713 గా మరియు తయారీ తేది మార్చి 2023 అని ఉంటే ఆ మందులను వాడొద్దని తెలిపింది.

 

ఈ బ్యాచ్ లేబిల్ ను తప్పుగా వేయడం వలన కంపెనీ దీనిని రీకాల్ చేసింది. కాగా ఈ బ్యాచ్ కు సంబంధించిన మందులను ఉత్తరప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version