లేటెస్ట్ న్యూస్: “టైగర్ నాగేశ్వరరావు” రిలీజ్ డేట్ లాక్ !

-

మాస్ మాహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ లతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాడని చెప్పాలి. ఈ మధ్యనే ధమాకా తో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న రవితేజ, వరుసగా రెండు సినిమాలను రిలీజ్ చేసే పనిలో పడ్డాడు. తాజాగా రవితేజ మరియు డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన “రావణాసుర” సినిమా ట్రైలర్ ను నిన్నే విడుదల చేయగా.. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రావణాసుర సినిమా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇప్పుడు సరికొత్తగా టైగెర్ నాగేశ్వరరావు సినిమాను రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసింది చిత్ర బృందం. అక్టోబర్ 20వ తేదీన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ సోషల్ మీడియా ద్వారా తెలియచేయడం విశేషం. మరి ఈ రెండు సినిమాలు ఎంత మేరకు రవితేజకు సక్సెస్ ను అందిస్తాయి అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version