గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి కదలికలపై భయాందోళనలు గురి అవుతున్నారు ప్రజలు. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలో పులి రోడ్డు దాటడం చూసినట్టు చెబుతున్నారు ఆర్టీసీ కండక్టర్ రవి కిరణ్. ఆగిరిపల్లి మండలం కళ్ళుటూరు గ్రామంకి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొకినల రవి కిరణ్.. ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో గన్నవరం బైక్ పై డ్యూటీ కి వెళ్తుండగా మార్గ మధ్యలో సగ్గురు, మెట్లపల్లి దారి మధ్యలో ఒక పులి పిల్లనీ చూసినట్టు చెబుతున్నారు.
ఆ వెంటనే ఈ విషయాన్ని స్థానిక గ్రామస్థులకు కండక్టర్ రవి సమాచారం అందించడంతో.. వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. అసలు కండక్టర్ చూసింది పులి పిల్లా లేక ఏదైనా వేరే జంతువునీ చూసి పులి పిల్లా అనుకొని బయపడ్డాడా??? అని విచారణ చేస్తున్నారు పోలిసులు. కొన్ని రోజుల క్రితం అడవి పందులు ఉచ్చు లో పడి ఒక మగ పులి స్థానికంగా మృతి చెందింది. ఆ ఘటన తర్వాత కొన్ని రోజులు గడవక ముందే కండక్టర్ పులి పిల్లను చూశాననీ చెప్పటంతో స్థానికంగా ఆందోళన మొదలయ్యింది. అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఈ విషయంపై దృష్టి పెట్టి మేట్లపల్లి సమీప ప్రాంతాల్లో ఏమైనా పులుల కదలికలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు స్థానికులు.