కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 4 ప్రాజెక్టులు కూలిపోయాయి : హరీష్ రావు

-

కొంతమంది మూర్ఖులు గాంధీ భవన్ లో కూర్చొని కాళేశ్వరం కూలిపోయింది, పెళ్లిపోయిందని మాట్లాడారు. కానీ ఓ మూర్ఖులారా ఒక్కసారి సిద్దిపేటకి వచ్చి గలగలపారుతున్న గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరంతో సిద్ధిపేటలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 4 ప్రాజెక్టులు కూలిపోయాయి.

ఖమ్మంలో పెద్దవాగు, నల్గొండలో సుంకేశాల, మహబూబ్ నగర్ లో వట్టేo ప్రాజెక్టు, తాజాగా SLBC టన్నెల్ కూలింది. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే రాజకీయంగా లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ చూసింది. మీ హయాంలో కూలితే ప్రకృతి వైపరీత్యం…మా హయాంలో కూలితే మేము చేసిన తప్పా అని ప్రశ్నిచారు హరీష్ రావు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ కి నీళ్లు తీసుకెళ్తా అని సీఎం రేవంత్ అంటున్నారు. మల్లన్నసాగర్ లో నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చినవి కావా అని అడిగారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version