టిల్లు స్క్వేర్‌.. రూ.100 కోట్ల గ్రాస్‌ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ

-

మల్లిక్ రామ్ దశరథంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌.అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ చిత్రం ఈ రోజున భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.టిల్లు స్క్వేర్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది .

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈసందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమా రానుందని తెలిపారు. ”తొలిరోజు రూ.25 కోట్ల గ్రాస్‌ ఉండొచ్చనుకుంటున్నా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల స్పందనను దృష్టిలోపెట్టుకొని థియేటర్లు, షోలు పెంచడానికి ప్రయత్నిస్తున్నా అని అన్నారు. ఓవర్‌సీస్‌లో ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. ఐపీఎల్‌ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైంది. దాని కారణంగా మూవీ కలెక్షన్స్‌ ఎఫెక్ట్‌ కావడం లేదు. మా మూవీ అంచనా ప్రకారం దాదాపు రూ.100 కోట్లు గ్రాస్‌ చేస్తుందని వెల్లడించారు . క్లైమాక్స్‌కు ‘టిల్లు 3’ అనౌన్స్‌మెంట్‌ అటాచ్‌ చేసి సోమవారం నుంచి ప్రదర్శిస్తాం” అని నాగవంశీ అన్నారు.ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news