‘పుష్ప 2 ది రూల్’ టీజర్ కి టైమ్ ఫిక్స్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్  దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా రిలీజ్ టైమ్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ పవర్ ఫుల్ టీజర్ ను రేపు ఉదయం 11:07 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ టీజర్ పుష్పరాజ్ ఎంట్రీ ను గుర్తు చేస్తుంది అని, బాక్సాఫీస్ వద్ద అలలు సృష్టిస్తుంది అని, గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version