బిజెపిని తన్ని తరిమేసే సమయం వచ్చింది – టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

-

హనుమకొండ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. బీజేపీ ని తన్ని తరిమే సమయం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖబడ్దార్ బీజేపీ నేతల్లారా..తెలంగాణ హక్కులు తుంగలో తొక్కితే మసైపోతారు జాగ్రత్త అని హెచ్చరించారు.

ఎందుకు మాపై ఈ వివక్ష..? ఎందుకు ఇంతలా విషం కక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే మరోపోరు తప్పదని హెచ్చరించారు. బతుకమ్మ ఉత్సవాలలో ఎక్కడా కంటికి కనిపించని బీజేపీ నేతలు ఇప్పుడు కపట ప్రేమలు నటిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కిషన్ రెడ్డి తన మాటలు ఉపసంహరించుకోవాలన్నారు.

కేంద్ర మంత్రులు దగుల్బాజీ మాటలు మానుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలోని ప్రతీ ఒక్కరిని తీవ్ర నిరుత్సాహపర్చాయన్నారు. బీజేపీ నేతలది తెలంగాణపై కపట ప్రేమేనన్నారు. పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలుచేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version