ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ నుంచి మీ ఫ్యామిలీ సేఫ్

-

డెంగ్యూ ఇప్పుడు అందరినీ వణికిస్తున్న జ్వరం ఇది. చివరకు న్యాయమూర్తులు, సెలబ్రెటీలు కూడా దీని బారిన పడి మృత్యువాత పడుతున్నారు. మరి అలాంటి డెంగ్యూ మీ ఇంటిని కబళించకూడదనుకుంటే ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, చికన్ గన్యా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఒంటికి వేప నూనె, కొబ్బరి నూనె కలిపి పూసుకో వడం వల్ల ఆ వాసనకు దోమలు దగ్గరకు రావు.

దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు కాకుండా కిటీకిటీలు, తలుపులు మూసి ఉంచాలి. బయట తిండి తినకపోవడమే మేలు. ఫిల్టర్ చేసిన, కాచి ఒడబోసిన నీళ్లనే మాత్రమే తాగాలి.

ఇంటి చుట్టూ నీరు నిలులేకుండా చూడాలి. పరిసరాల్లో పాతటైర్లు, కొబ్బరి చిప్పలు, వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూడాలి. ఇందులో నిల్వ ఉన్న నీటిలోనే డెంగీ దోమలు పెరుగుతాయి. ఇంటి మిద్దెలపై పాత సామాను ఉంటే తీసివేయాలి.

ఇంటి మూలల్లో చీకటిలో డెంగీ దోమలు ఉంటాయి. అలాంటి ప్రాంతాలను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని నిల్వ చేస్తే వాటిపై మూతలు పెట్టాలి. వారానికి ఒక రోజు ఆ నీటిని పారబోసి పూర్తిగా ఆరబెట్టాలి.

దోమల నియంత్రణకు ఫాగింగ్ అవసరం. మీ ప్రాంతంలో మునిసిపల్ అధికారులను ఫాగింగ్ చేయమని మీరు ఒత్తిడి తేవాలి. వారు చేయకపోతే.. పై అధికారులకు ఫిర్యాదు చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version