సిబిల్ స్కోర్ పెరగాలా…? అయితే ఇలా చెయ్యండి..!

-

ఇది వరకు సిబిల్ స్కోర్ మీద ఎక్కువ అవగాహనా ఎవరికీ లేదు. కానీ ఈ మధ్యన అందరికీ కూడా సిబిల్ స్కోర్ అంటే ఏంటి ఎలా పెంచుకోవచ్చు అనేది తెలుస్తోంది. బ్యాంకులు ఇచ్చే రుణాలకు, క్రెడిట్ కార్డులకు సిబిల్ స్కోర్ అవసరం. అయితే ఈ విషయం అందరికీ తెలిసినా కూడా పలు తప్పులు చేస్తున్నారు.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. తక్కువ వడ్డీకే లోన్ పొందాలన్నా లోన్స్ కోసం అయినా లేదంటే క్రెడిట్ కార్డ్ కి అయినా సరే మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. ఇక మరి ఈ క్రెడిట్ స్కోర్ ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ టిప్స్ తో ఈజీగా క్రెడిట్ స్కోర్ ని మనం పెంచుకోవడానికి అవుతుంది.

సిబిల్ స్కోర్ మూడు అంకెల నెంబర్. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 పైన సిబిల్ స్కోర్ ఉంటేనే మంచిది.
ఆర్థిక క్రమశిక్షణ పాటించే వారికి మంచి సిబిల్ స్కోర్ ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన రిపోర్ట్ ఇది.
భారతదేశంలో క్రెడిట్ బ్యూరోల్లో ఒకటైన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ ఈ స్కోర్ ని ఇస్తుంది.
750 పైన మాత్రమే ఇది ఉంటే మంచిది చూసుకోండి.
మంచి క్రెడిట్ స్కోర్ కోసం 18 నెలల నుంచి 36 నెలల వరకు సమయం పడుతుంది.
ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండి ఎక్కువ లోన్స్ తీసేసుకుంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
క్రెడిట్ కార్డ్ ని ఉపయోగిస్తున్న వాళ్ళు బిల్లుల్ని గడువులోగా చెల్లించాలి.
క్రెడిట్ కార్డ్ బిల్లు సమయానికి చెల్లించలేకపోతున్నారంటే మీ ఆర్థిక పరిస్థితి బాలేదని.
ఒకవేళ కనుక ఇప్పటివరకు సిబిల్ స్కోర్ లేదంటే లోన్ తీసుకోలేదని.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version