మహిళలూ ఆరోగ్యాంగా ఉండాలా? అయితే ఇలా తప్పక చేయాలి..!

-

ఇంట్లో మహిళలు ఉదయం లేచినప్పుడు నుండి పడుకునే వరకు ఎన్నో పనులను చేస్తూ ఉంటారు. పిల్లలను చూసుకోవడం, భర్తను ఆఫీసుకు పంపించడంతో పాటుగా ఇంటి పనులను కూడా పూర్తి చేస్తారు. మరి కొందరైతే ఇంట్లో పనులతో పాటుగా ఉద్యోగాలను కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు వారి ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకోరు. మహిళల ఆరోగ్యం బాగుండాలంటే తప్పకుండా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో పాటుగా వ్యాయామాలను కూడా చేస్తూ ఉండాలి. శారీరికంగా ఎక్కువ పని చేయడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

కనుక సరైన పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, బీన్స్, పెరుగు, మొలకెత్తిన గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మహిళల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది మరియు పనులను కూడా చేయగలుగుతారు. అదేవిధంగా నెలసరి సమయంలో కూడా మరింత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో ఆరోగ్యం బాగుంటుంది. శారీరికంగా పనులు చేస్తున్నా సరే వ్యాయామాలు కూడా చేయడం ఎంతో అవసరం. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

క్రమం తప్పకుండా ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలను చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి అనేది సహజమే. అయితే ఒత్తిడి వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించుకోవాలి. నచ్చిన పనులను చేయడం మరియు ఆనందంగా ఉండడం వలన మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. కనుక ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మహిళల ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైన మార్పులతోపాటుగా తరచుగా కొన్ని రకాల వైద్య పరీక్షలను చేయించుకోవాలి. బీపీ, మధుమేహం వంటి సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కనుక వాటికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version