మీరు కూడా బిజీ నాన్నేనా…? ఈ మార్పులు చేస్తే బెస్ట్ నాన్న అనిపించుకోవచ్చు..!

-

చాలా మంది తండ్రులు బిజీ అయి పోతూ ఉంటారు. పనిలో పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోరు. కానీ నిజానికి మంచి నాన్న అనిపించుకోవాలంటే మీ కుటుంబం తో కాస్త సమయాన్ని స్పెండ్ చేయాలి. అదేవిధంగా మంచి నాన్న అనిపించుకోవాలంటే ఈ మార్పులు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా బెస్ట్ నాన్న అనిపించుకుంటారు.

కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేయండి:

చాలా మంది తండ్రులు పనిలో పడిపోయి కుటుంబం గురించి పట్టించుకోరు అలా కాకుండా కాస్త సమయాన్ని గడపండి.

సరిగ్గా ప్లాన్ చేసుకోండి:

మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుని పనులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు కుటుంబాన్ని పనిని కూడా హ్యాండిల్ చేయడానికి అవుతుంది.

కొన్ని రోజులు వర్క్ ఫ్రం హోం చేయండి:

కొన్ని రోజులు మీరు వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల మీ పిల్లలతో మీరు ఎక్కువ సమయాన్ని గడిపేందుకు అవుతుంది.

యాక్టివిటీస్ ని మిక్స్ చేయండి:

మీ పనులు తో పాటుగా మీ పిల్లలతో ఆటలాడడం వంటివి చేయండి ఒకవేళ మీరు వర్క్ అవుట్స్ చేస్తున్నట్లు అయితే ఆ సమయంలో కాస్త మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్లయితే మీ పిల్లలు కూడా మీతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయడానికి అవుతుంది.

షెడ్యూల్ బాగా చేసుకోండి:

చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాలని అనుకుంటారు ఇలా చేయడం వలన పనులు సరిగ్గా అవ్వవు. పైగా సమయం కూడా ఉండదు.

స్క్రీన్ టైమ్ ని తగ్గించండి:

రాత్రి ఆఫీస్ అయిపోయిన తర్వాత చాలామంది స్క్రీన్ల ముందు సమయాన్ని గడుపుతూ ఉంటారు అలా కాకుండా స్క్రీన్ల మీ సమయాన్ని గడిపే బదులు మీ కుటుంబంతో గడపండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version