పరీక్షలు వస్తున్నాయా..? అయితే మీపై మీరు నమ్మకం పెంచుకోవడానికి మార్గాలు..!

-

పరీక్షలు దగ్గర పడుతున్నాయి అంటే పిల్లలకి చాలా టెన్షన్ ఉంటుంది. పైగా ఫెయిల్ అయిపోతారెమో అన్న భయం, అలాగే తీవ్ర ఒత్తిడి కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళ పై వాళ్ళు నమ్మకం పెట్టుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇక్కడ వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే చూసేయండి.

పాజిటివ్ గా ఉండడం:

మనసులో భయాన్ని పెట్టుకుని మంచి స్కోర్ చేయగలమా లేదా అని నెగిటివ్ ఆలోచనలు ఉంటే తీసేయండి. ప్రతిసారి కూడా పాజిటివ్ గా ఉండండి. పాజిటివిటినీ పెంచుకోవడం వల్ల మీపై మీకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఏదైనా నెగటివ్ ఆలోచనలు ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి:

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు, గింజలు తీసుకోండి. అలానే సరిపడా నీళ్ళు రోజూ తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మైండ్ పవర్ కూడా బాగుంటుంది.

మెడిటేషన్ చేయడం:

మెడిటేషన్ చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం, మీకు నచ్చిన ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, రిలాక్స్ గా ఉండడం చేయండి. అలానే యోగా లేదా మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడిని సులువుగా తరిమికొట్టొచ్చు.

బాగా ప్రిపేర్ అవ్వండి:

మంచిగా ప్రిపేర్ అయితే అన్నీ బాగుంటాయి. క్లాసులు సరిగ్గా వినడం, జాగ్రత్తగా చదువుకోవడం, పరీక్షలు కి కావలసిన మెటీరియల్ చదువుకోవడం ముఖ్యం.

100% స్కోర్ చేయడం మాత్రమే సక్సెస్ కాదు:

చాలామంది నూటికి నూరు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా జరగలేదు అంటే అది ఫెయిల్ అయిపోయినట్టు కాదు. కాబట్టి మీకు ఎంత శాతం వస్తే దానితో మీరు ఆనందంగా ఉండండి. చిన్న చిన్న వాటిని కూడా ఆనందంగా స్వీకరించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version