ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఏపీలోని నంద్యాల టోల్‌గేట్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు బస్సు తిరువన్నామలై నుంచి హైదరాబాద్‌కు వస్తుంది. బస్సు సరిగ్గా నంద్యాల టోల్‌గేట్ సమీపంలోకి రాగానే టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై బస్సులో నుంచి వెంటనే కిందకు దిగిపోయారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ప్రమాదం జరిగిన టైంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.