కౌశిక్‌ రెడ్డిపై 28 కేసులు పెట్టారు – హరీష్‌ రావు సీరియస్

-

కౌశిక్‌ రెడ్డిపై 28 కేసులు పెట్టారని హరీష్‌ రావు సీరియస్ అయ్యారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు…మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. డిజిపి గారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదని వార్నింగ్‌ ఇచ్చారు.

బెయిలబుల్ సెక్షన్స్ లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలని కోరారు. బెయిలబుల్ కేసులు అని తెలిసి రాత్రంతా ఇబ్బంది పెట్టారని… బెయిలబుల్ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పిందని తెలిపారు.

కానీ కావాలని పండుగ పూట డెకాయిట్ నో, టెర్రరిస్ట్ నో అరెస్ట్ చేసినట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలో అనేదానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డిజిపి గారిని కోరుతున్నానని… ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలని సూచిస్తున్నా అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version