తిరుమల శ్రీవారి హుండీలో విదేశీ కరెన్సీ కలకలం రేపింది. భారీగా విదేశీ కరేన్సి నోట్లను శ్రీవారి హుండిలో కానుకలుగా సమర్పించారు భక్తులు.. ప్రపంచంలోని 195 దేశాలుగాను…..శ్రీవారి హుండిలో 157 దేశాల కరేన్సి నోట్లను సమర్పించారు భక్తులు.. అత్యధికంగా మలేషియా కరేన్సి నోట్లు 46 శాతం కాగా…తరువాత స్థానంలో యుఎస్ డాలర్ల నోట్లు 16 శాతం ఉన్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
2019-20 సంవత్సరంలో 4.73 లక్షల విదేశి కరేన్సి నోట్లతో…. స్వామి వారికి 27.49 కోట్ల హుండి ఆదాయానికి చేరుకుంది. 20-21 సంవత్సరంలో విదేశి ఆదాయం పై కోవిడ్ ప్రభావం పడిన సంగతి తెలిసిందే. 20-21లో 30 వేల 300 విదేశి నోట్లతో 1.92 కోట్లుకు పరిమితం అయింది హుండి ఆదాయం. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగనుంది విదేశీ నోట్ల ఆదాయం. స్వామి వారికి పాకిస్థాన్ నోట్ల ను కూడా కానుకగా సమర్పిస్తూన్నారు భక్తులు. ఇది ఇలా ఉండగా… కరోనా మహమ్మారి నేపథ్యంలో శ్రీవారి దర్శనాలకు పరిమిత సంఖ్యలోనే అనుమతులు ఇస్తోంది టీటీడీ పాలక మండలి.