తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల మీద చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమే….ఆ విధానం తీసేయాలని, సీఎం హోదాలో వెళ్లే సీఎం కు డిక్లరేషన్ అడిగే హక్కు లేదని ఆయన కామెంట్స్ చేశారు. అంతే కాక ఎక్కడలేని సంప్రదాయం తిరుమల లో మాత్రం ఎందుకు!? దాన్ని తీసేయాలని, సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా!? అని అంటూ ఆయన చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. తాజాగా తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ విషయం మీద స్పందించారు.
శ్రీవారి పై అపారమైన భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి సియం జగన్ అని ఆయన అన్నారు. జగన్ కి ప్రజలు పై విశ్వాసం… ప్రజలే దేవుళ్ళు గా భావిస్తారని అన్నారు. ఆయనకు కులం, మతం పట్టింపులు లేవని అన్నారు. కొడాలి నాని వాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న ఆయన డిక్లరేషన్ అంశం ఇప్పుడు అనవసరంమని గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ అనేక సార్లు శ్రీవారి దర్శనం కోసం విచ్చేశారని అన్నారు. శ్రీవారి భక్తుడు కాబట్టే జగన్ కాలినడకన తిరుమల విచ్చేశారన్న ఆయన దేశంలో ఎవరు చెయ్యని సంక్షేమ పథకాలను అమలు చేస్తూండడంతో ప్రతిపక్షాలు కుట్ర చేస్తూన్నాయని అన్నారు.