తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మిక గురువులు సద్గురు, రవిశంకర్ కీలక వ్యాఖ్యలు

-

ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. స్వామివారికి, భక్తులకే సమర్పించే లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వు నుంచి తయారైన నెయ్యిని వాడినట్లు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అయితే, దీనిపై విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని భక్తులు, పలువురు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై ఆధ్యాత్మిక గురువులు సద్గురు, రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. హిందువుల మనోభావాల్ని లడ్డూ కల్తీ వ్యవహారం దెబ్బతీసిందని, అందుకే దేవాలయాల నిర్వహణ బాధ్యతలను భక్తులకే అప్పగించాలని వ్యాఖ్యానించారు. భక్తి లేని చోట పవిత్రత ఉండదని సద్గురు పేర్కొన్నారు ఆలయ నిర్వహణ బాధ్యతలను వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలకు కాకుండా మతపెద్దలు, భక్తులకు అప్పగించాల్సిన టైం వచ్చిందని రవి శంకర్ ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news